Wednesday, September 14, 2011

1.16 లక్షల ఉద్యోగాల భర్తీ

రాష్ట్ర ప్రభుత్వంలోని 28 శాఖల్లో ఖాళీగా ఉన్న 1.16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ ఖాళీలన్నింటినీ వచ్చే డిసెంబర్ నాటికి నోటిఫై చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. అవినీతికి తావులేకుండా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు సూచించారు. ఉద్యోగాల భర్తీపై మంగళవారం సాయంత్రం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి. ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. రెండో దశ ఎస్‌ఐ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను హైదరాబాద్ నగరంతో సహా తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. మెజారిటీ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, ఉపాధ్యాయుల డీఎస్సీ నియామక సంస్థల వంటివి ఈ నోటిఫికేషన్లకు అనుగుణంగా పరీక్షల కేలండర్‌లను రూపొందించుకుని త్వరితగతిన భర్తీ చేయాలని ఆదేశించారు. గ్రూప్-1, 2 సహా అనేక రిక్రూట్‌మెంట్‌లను వచ్చే మూడు నెలల్లో చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు

No comments:

Post a Comment