Wednesday, July 31, 2013

UPSC EXAM Calendar 2014 - Important changes

UPSC has announced dates for IAS PRE (CSAT) Exam 2014. it is tentative date but its almost 3 months later than previous exam dates. 

Date of Notification: 17 May 2014

Last Date to Apply: 16 June 2014

Date of IAS PRE (CSAT) Exam: 24 AUGUST 2014

UPSC EXAM Calendar 2014


S.No.NAME OF EXAMINATION DATE OF
NOTIFICATION
LAST DATE FOR
RECEIPT OF
APPLICATIONS
DATE OF
COMMENCEMENT
OF EXAM
DURATION OF
EXAM.
123456
1RESERVED FOR UPSC
RT/EXAM
  05.01.2014
(SUNDAY)
1 DAY
(Two Tests)
2SCRA Exam, 2014 05.10.201304.11.2013
(MONDAY)
12.01.2014
(SUNDAY)
1 DAY
3C.D.S. EXAM.(I), 201402.11.201302.12.2013
(MONDAY)
09.02.2014
(SUNDAY)
1 DAY
4RESERVED FOR UPSC
RT/EXAM
  02.03.2014
(SUNDAY)
1 DAY
(Two Tests)
5N.D.A. & N.A. EXAM.(I), 201421.12.201320.01.2014
(MONDAY)
20.04.2014
(SUNDAY)
1 DAY
6I.E.S./I.S.S. EXAM., 2014 08.02.201410.03.2014
(MONDAY)
24.05.2014
(SATURDAY)
3 DAYS
7GEOLOGISTS' EXAM., 201415.02.2014 17.03.2014
(MONDAY)
8CISF AC(EXE) LDCE-201401.03.201431.03.2014
(MONDAY)
01.06.2014
(SUNDAY)
1 DAY
9ENGINEERING SERVICES
EXAMINATION, 2014
15.03.201414.04.2014
(MONDAY)
20.06.2014
(FRIDAY)
03 DAYS
10COMBINED MEDICAL
SERVICES EXAM, 2014
22.03.201421.04.2014
(MONDAY)
22.06.2014
(SUNDAY)
1 DAY
11RESERVED FOR UPSC
RT/EXAM
    06.07.2014
(SUNDAY)
1 DAY
(Two Tests)
12CENTRAL ARMED POLICE
FORCES (AC) EXAM., 2014
4/5/201405-05-2014
(MONDAY)
13.07.2014
(SUNDAY)
1 DAY
13RESERVED FOR UPSC
RT/EXAM
  17.08.2014
(SUNDAY)
1 DAY
(Two Tests)
14CIVIL SERVICES
(PRELIMINARY) EXAM, 2014
17.05.2014 16.06.2014
(MONDAY)
24.08.2014
(SUNDAY)
 
15INDIAN FOREST SERVICE
(Preliminary) EXAM, 2014
through CS [P] Exam 2014
1 DAY
16N.D.A. & N.A. EXAM.(II), 201421.06.201421.07.2014
(MONDAY)
28.09.2014
(SUNDAY)
1 DAY
17RESERVED FOR UPSC
RT/EXAM
  12.10.2014
(SUNDAY)
1 DAY
(Two Tests)
18C.D.S. EXAM.(II), 201419.07.2014 18.08.2014
(MONDAY)
26.10.2014
(SUNDAY)
1 DAY
19INDIAN FOREST SERVICE
(MAIN) EXAM, 2014
  22.11.2014
[SATURDAY]
10 DAYS
20CIVIL SERVICES
(MAINS) EXAM, 2014
.
14.12.2014
(SUN DAY)
5 DAYS

NOTE:- THE DATES OF NOTIFICATION, COMMENCEMENT AND DURATION OF EXAMINATIONS/RTs ARE LIABLE TO ALTERATION, IF THE CIRCUMSTANCES SO WARRANT

--

Other side of our own country's basic democracy- from a civil servants point of view





 
 
 
 

Thursday, July 25, 2013

How to prepare for Civil service Mains( New pattern)-for telugu medium aspirants

సివిల్స్ మహా యజ్ఞంలో అంకం పూర్తయింది. మే 26 ప్రిలిమ్స్ పరీక్ష ముగిసింది. ఇక కీలకమైన మెయిన్స్‌కు అభ్యర్థులు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. కంఠస్థం చేయడం, విషయ సేకరణలకు ప్రాధాన్యం లేకుండా అభ్యర్థి బుద్ధికుశలతను, సామాజిక, సమకాలీన సమస్యలపై అవగాహనను పరీక్షించాలన్న ఉద్దేశంతో మెయిన్స్లో మార్పులు చేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మెయిన్స్ రాతపరీక్షలో జనరల్స్టడీస్ పరిధిని బాగా పెంచారు. మొత్తం వెయ్యి మార్కులతో నాలుగు పేపర్లను అభ్యర్థులు రాయాలి. నేపథ్యంలో జనరల్ స్టడీస్ పేపర్-1 సిలబస్లో ఏయే అంశాలున్నాయి? వాటిపై పట్టుసాధించడమెలా? వంటి అంశాలపై నిపుణులు అందిస్తున్న విశ్లేషణ...

సివిల్ సర్వీసెస్ మెయిన్స్
పేపర్-2 (జనరల్ స్టడీస్-1)-250 మార్కులు
ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్
సొసైటీ

చరిత్ర
సివిల్స్ మెయిన్స్ రెండో పేపర్ (జీఎస్-1)కు సంబంధించిన సిలబస్ను విశ్లేషిస్తే 'చరిత్ర'కు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే సబ్జెక్టు పరిధి విస్తృతమైందని చెప్పొచ్చు. జనరల్ స్టడీస్ హిస్టరీ సిలబస్లో పేర్కొన్న కొత్త అంశాల్లో చాలావరకు ఆప్షనల్ సిలబస్ నుంచి తీసుకున్నవే. నేపథ్యంలో హిస్టరీ ఆప్షనల్తో పరీక్షకు సిద్ధమవుతున్నవారికి పేపర్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశముంది. సిలబస్లో పేర్కొన్న అంశాలను వరుసగా పరిశీలిస్తే
...

భారతదేశ సంస్కృతి (ఇండియన్
కల్చర్):
సంగీతం, సాహిత్యం, నాట్యం, వాస్తు-శిల్పకళ, పెయింటింగ్స్, మత ఉద్యమాలు, తత్వాలు తదితర అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అంశాలను ప్రాచీన, మధ్య, ఆధునిక భారత దేశ చరిత్రలకు అన్వయించుకుంటూ పరీక్షకు సిద్ధమవాలి.

  1. అభ్యర్థులు ప్రామాణిక హిస్టరీ పుస్తకాల ఆధారంగా క్రమ పద్ధతిలో ఒక్కో అంశంపై పట్టు సాధిస్తూ ముందుకెళ్లాలి. ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతి పుస్తకాలు అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటాయి. మధ్య భారతదేశ చరిత్రకు సంబంధించినంతవరకు సతీశ్చంద్ర పుస్తకాలు చదవాలి.
  2. భారత సంస్కృతికి చెందిన సంగీతం, సాహిత్యం, నాట్యం, కట్టడాలు, మత ఉద్యమాలు, తత్వాలు ప్రాచీన, మధ్య, ఆధునిక కాలాలకు అన్వయిస్తూ చదవాలి.

ఆధునిక భారతదేశం:
18 శతాబ్దం మధ్య భాగం నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను క్షుణ్నంగా పరిశీలించాలి.

  1. భారత దేశానికి ఐరోపా కంపెనీల రాక.
  2. దేశంలో ఆంగ్లేయుల కార్యకలాపాలు విస్తరించిన తీరు.
  3. ఆంగ్లేయుల ఆర్థిక, పరిపాలనా విధానాలు.
  4. 19, 20 శతాబ్దాల్లో చోటుచేసుకున్న సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు.
  5. బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, ఉద్యమాలు.
  6. చరిత్రలో కీలకమైన భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. దీనికోసం ఆధునిక భారతదేశంపై బిపిన్చంద్ర రాసిన పుస్తకాలు చదవాలి.
  7. స్వాతంత్య్రం తర్వాత జరిగిన పరిణామాలను సిలబస్లో కొత్తగా చేర్చారు. ఇందులో చరిత్రతో పాలిటీ, ఎకనామిక్స్కు సంబంధించిన అంశాలు కూడా కలిసి ఉంటాయి. వీటిని సమన్వయం చేసుకుంటూ విషయంపై పట్టుసాధించాలి.
  8. రాజ్యాంగ సంబంధిత అంశాలు.
  9. పంచవర్ష ప్రణాళికలు
  10. భూ సంస్కరణలు
  11. నెహ్రూ విదేశాంగ విధానం
  12. అలీనోద్యమం తీరుతెన్నులు
  13. హరిత విప్లవం రూపురేఖలు తదితరాలు..
  14. వీటికోసం బిపిన్చంద్ర రాసిన 'ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్' పుస్తకం చదవాలి.

ప్రపంచ చరిత్ర.. ఆకాశమే హద్దు..
ప్రపంచ చరిత్ర నుంచి అంశాలపై ప్రశ్నలు వస్తాయో కచ్చితంగా చెప్పడం కష్టం. 18 శతాబ్దం నుంచి జరిగిన సంఘటనలను సిలబస్లో పేర్కొన్నారు కాబట్టి ఐరోపా, అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు సంబంధించి దేనిపైనైనా అడగడానికి అవకాశముంది.

  1. ప్రపంచ ఆర్థికరంగ స్థితిగతుల్నే మార్చేసిన పారిశ్రామిక విప్లవం.
  2. మొదటి ప్రపంచ యుద్ధం (1914-18), రెండో ప్రపంచ యుద్ధం (1939-45)
  3. ఐరోపాలో నూతన రాజ్యాల ఆవిర్భావం
  4. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో వలసవాదం, స్వాతంత్య్ర ఉద్యమాలు.
  5. వీటికోసం ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతి పుస్తకాలు చదవాలి. ఎల్.ముఖర్జీ.. ప్రపంచ చరిత్ర వాల్యూమ్-1, వాల్యూమ్-2లతో పాటు నార్మన్ లోవే రాసిన మాస్టరింగ్ మోడర్న్ వరల్డ్ హిస్టరీ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. వీటిని ఆసాంతం చదవనవసరం లేదు. ముఖ్యాంశాలపై విశ్లేషణాత్మక కోణంలో అధ్యయనం చేయాలి.

కరీం,
సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.

 

జాగ్రఫీ
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1లో జాగ్రఫీకి సంబంధించి సిలబస్లో పేర్కొన్న అంశాలు:

  1. వరల్డ్ జాగ్రఫీ-కీలక అంశాలు.
  2. ప్రపంచ వ్యాప్తంగా (దక్షిణాసియా, భారత ఉపఖండంతో సహా) ప్రధాన సహజ వనరుల విస్తరణ.
  3. ప్రపంచ వ్యాప్తంగా (భారత్ సహా) వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఉనికి.
  4. గతంతో పోలిస్తే జనరల్ స్టడీస్ పేపర్లో జాగ్రఫీ సబ్జెక్టు పరిధి విస్తృతమైంది. గతేడాది కేవలం ఇండియా జాగ్రఫీని మాత్రమే సిలబస్లో పేర్కొంటే ఈసారి వరల్డ్ జాగ్రఫీని అదనంగా చేర్చారు.
  5. జాగ్రఫీకి సంబంధించి మూల నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. నేపథ్యంలో జాగ్రఫీ ఆప్షనల్తో పరీక్షకు సిద్ధమవుతున్నవారికి పేపర్లో మంచి స్కోర్ సాధించడానికి వీలుంది.

వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ:
వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీలోని అంశాలకు ఆకాశమే హద్దు. అందువల్ల ప్రిపరేషన్లో భాగంగా తొలుత బేసిక్ విషయాలపై పట్టుసాధించాలి. తర్వాత ముఖ్యమైన అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి.

ఇందులోని
ముఖ్యాంశాలు: భూ స్వరూపాలు (ల్యాండ్ ఫార్మ్స్), వాతావరణం, మృత్తికలు, సహజ ఉద్భిజాలు(నేచురల్ వెజెటేషన్) వంటి భౌతిక, భౌగోళిక అంశాలు. వీటిని రెండు విధాలుగా విభజించి చదవాలి. అప్పుడే పేపర్లో గరిష్టంగా మార్కులు పొందేందుకు వీలుంటుంది.

భౌతిక
, భౌగోళిక అంశాలు:
1.
సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు.
2.
ప్రత్యేక లక్షణాలున్న అంశాలు
.
విషయం గురించి చదువుతున్నప్పుడు అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశముందో ఆలోచించి చదవాలి. అప్పుడే ప్రిపరేషన్ సఫలీకృతమవుతుంది
.

ఉదా: శీతోష్ణస్థితి అనే అంశంపై చదువుతున్నప్పుడు ఒక ప్రాంతంలోని శీతోష్ణస్థితి అక్కడి ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతోందన్న దానిపై దృష్టి సారించాలి
.

ముఖ్యమైన భూభౌతిక దృగ్విషయాలు: భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, తుపానులు తదితరాలు. తొలుత అంశాలపై శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి. తర్వాత అవి ఎక్కడెక్కడ.. ఎందుకు? సంభవిస్తున్నాయో తెలుసుకోవాలి
.

మానవ జోక్యం వల్ల భౌగోళిక అంశాల్లో మార్పులు వస్తున్నాయి? ఆయా మార్పుల ప్రభావం ఏమిటి? వంటి అంశాలపై దృష్టి సారించాలి. క్లుప్తంగా చెప్పాలంటే 'అభివృద్ధి-పర్యావరణం' కోణంలో చదవాలి
.

జాగ్రఫీ సిలబస్లోని మరొక కీలకాంశం- ముఖ్యమైన సహజ వనరుల విస్తరణ. దీనిపై ప్రిపరేషన్లో భాగంగా సహజవనరుల్లో ప్రధానమైనవి, సమకాలీన (వివాదాల్లో ఉండటం వంటివి) ప్రాధాన్యం ఉన్నవి ఏమిటో గుర్తించాలి.

  1. రకమైన వనరులు ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి.. అలా ఉండటానికి అనుకూలించిన పరిస్థితులు ఏమిటి? తదితర విషయాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి.
  2. ప్రాంత అభివృద్ధిలో అక్కడి సహజ వనరులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో చూడాలి. అభివృద్ధికి, వనరుల విస్తరణకు సంబంధాన్ని అవగతం చేసుకోవాలి.
  3. సహజ వనరుల విస్తరణకు(భూ వనరులు, జల వనరులు, అటవీ వనరులు, ఇంధన వనరులు, సంబంధించి దక్షిణాసియా, భారత ఉపఖండానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రపంచంలో ప్రాంతాల్లో రకమైన పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.. దానికి గల కారణాలేంటి? వనరుల విస్తరణకు, పరిశ్రమల అభివృద్ధికి మధ్య సంబంధాలను అధ్యయనం చేయాలి. పరిశ్రమలకు సంబంధించి భారత్పై ప్రత్యేక దృష్టిపెట్టాలి.

  1. జనరల్ స్టడీస్ పేపర్-1 సిలబస్లో సామాజిక అంశాలను కూడా చేర్చారు. సిలబస్లో ఇచ్చిన అంశాలను వేర్వేరుగా చూడకుండా అన్నింటినీ కలిపి చదవాలి. జనాభా, పేదరికం, పట్టణీకరణ-సమస్యలు, పరిష్కారాలు, సమాజంలో మహిళల పాత్ర వంటి అంశాలను ఒకదాంతో మరొకదాన్ని సమన్వయం చేసుకుంటూ చదవాలి. భారతీయ సమాజంలోని వైవిధ్యంపై దృష్టిసారించాలి.
  2. భారతదేశ జనాభాపై ప్రపంచీకరణ ప్రభావాన్ని ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. ఆర్థిక, సామాజిక, పర్యావరణ తదితర అంశాలపై ప్రపంచీకరణ చూపించిన ప్రభావాలను అధ్యయనం చేయాలి.

-గురజాల శ్రీనివాసరావు,  సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.

టిప్స్

  1. ఇచ్చిన ప్రశ్నను క్షుణ్నంగా అర్థంచేసుకొని, దానికి సరైన సమాధానాన్ని బాగా ప్రజెంట్ చేసినపుడే మంచి మార్కులు వస్తాయి. అవసరాన్ని బట్టి టేబుళ్లు, మ్యాప్లు, బొమ్మలతో సమాధానాలు రాయాలి.
  2. ఈసారి ప్రశ్నలు రూపంలో ఉంటాయో తెలీదు. అందువల్ల ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు అది ఎన్నిమార్కుల ప్రశ్న, సమయం ఎంత కేటాయించాలి? తదితరాలను బేరీజు వేసుకొని ప్రశ్నకు సమాధానం రాయాలి.
  3. ప్రశ్న జనరల్గా అడిగితే సమకాలీన అంశాలను ప్రస్తావిస్తూ సమాధానం రాస్తే మంచి మార్కులు వస్తాయి.
  4. ఒక టాపిక్కు ఒక పుస్తకం అని కాకుండా అన్ని విషయాలూ కవరయ్యే ప్రామాణిక పుస్తకాలతో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో వివిధ ప్రాథమిక అంశాలపై పట్టు సాధించవచ్చు.

 

 

సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్: పేపర్-3 (జనరల్ స్టడీస్-2) 250 మార్కులు

సిలబస్: పరిపాలన (గవర్నెర్స్), రాజ్యాంగం (కాన్స్టిట్యూషన్), రాజకీయ వ్యవస్థ (పాలిటీ), సామాజిక న్యాయం (సోషల్ జస్టిస్), అంతర్జాతీయ సంబంధాలు (ఇంటర్నేషనల్ రిలేషన్స్)

సివిల్స్ మెయిన్స్ రాతపరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్-2 సిలబస్ను నిశితంగా పరిశీలిస్తే భారత్కు సంబంధించిన ప్రజా పరిపాలన, రాజకీయ వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాల మేళవింపుగా ఉంది. నేపథ్యంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా పొలిటికల్ సైన్స్ను ఆప్షనల్గా తీసుకొన్న అభ్యర్థులకు పేపర్-2 బోనస్ అని చెప్పొచ్చు.

సిలబస్ను చాప్టర్ల వారీగా పరిశీలిస్తే...

1.
భారత రాజ్యాంగం- చారిత్రాత్మక అంశాలు, పరిణామక్రమం తదితర అంశాలు..

  • వీటిని అధ్యయనం చేసే క్రమంలో 1858 భారత ప్రభుత్వ చట్టం దగ్గరి నుంచి 1947 స్వాతంత్య్ర చట్టం వరకు రాజ్యాంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలను చదవాలి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలపై అభ్యర్థులు ఎక్కువ దృష్టిసారించాలి. రాజ్యాంగ పీఠిక (Preamble), ప్రాథమిక హక్కులు (Funda-mental Rights), ఆదేశిక సూత్రాలు (Directive Principles) వంటి మూల, కీలక అంశాలను చదవాలి. V, VI, VII, X, XI, XII షెడ్యూళ్లపై అభ్యర్థులు దృష్టిపెట్టాలి. రాజ్యాంగ మూల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి కేశవానంద భారతి, మినర్వా మిల్స్ కేసులను పరిశీలించాలి.
  • రిఫరెన్స్: Introduction to the Constitution of India, 20th edition. D. D.Basu

    2.
    కేంద్రం, రాష్ట్రాల విధులు, బాధ్యతలు..
  • వీటికి సంబంధించి అధ్యయనం చేసేటప్పుడు కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాల విభజన, భారత రాజకీయ వ్యవస్థ తాలూకు అర్ధ సమాఖ్య స్వభావం (quasi federal nature) పై దృష్టిసారించాలి. రాష్ట్రాల నుంచి స్థానిక సంస్థలకు అధికారాల సంక్రమణపై 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రభావాన్ని పరిశీలించాలి.
  • రిఫరెన్స్: Introduction to the Constitution of India, 20th edition

3. ప్రభుత్వంలోని వివిధ అంగాల మధ్య అధికారాల విభజన..

  అంశానికి సంబంధించి మాంటెస్క్యూ (Montes-quieu) అధికార విభజన సిద్ధాంతంపై అభ్యర్థులు దృష్టిసారించాలి. పార్లమెంటు తరహా ప్రభుత్వాలున్న భారత్ వంటి దేశాలకు సంబంధించి సిద్ధాంత అనువర్తిత అంశాలను చదవాలి.

  నిర్దేశ కాలంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్లో తలెత్తిన వివాదాలను పరిష్కరించే చట్టబద్ధమైన, అనధికార పద్ధతులు రూపొందాయి. వీటిపై అభ్యర్థులు దృష్టి సారించాలి.

  రిఫరెన్స్: Introduction to Political Theory, 4th edition, Gauba.

4.
వివిధ దేశాల రాజ్యాంగాలు-భారత్తో పోలిక..

ఎక్కువ శాతం ఆధునిక రాజ్యాలు ప్రజాస్వామ్యబద్ధం గా వ్యవహరిస్తున్నప్పటికీ వాటి వ్యవస్థీకరణలో, పని తీరులో తేడాలున్నాయి. భారత రాజ్యాంగం ఆధునిక రాజ్యాంగాల నుంచి కొన్ని భావాలను ఉదారంగా స్వీకరించింది. బ్రిటన్, అమెరికా, ఐర్లాండ్, దక్షిణా ఫ్రికా, జర్మనీ(వైమార్ రాజ్యాంగం), సోవియట్ యూనియన్ రాజ్యాంగాలు భారత రాజ్యాంగాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అలాగే ఫ్రెంచ్ విప్లవ నినాదాలు- స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం- మన రాజ్యాంగంలో ప్రస్తావించబడ్డాయి. నేపథ్యం లో: పార్లమెంటరీ-అధ్యక్ష, ఏకకేంద్ర-సమాఖ్య, రాచ రిక-రిపబ్లికన్ మొదలైన భావాల ఆచరణలో భారత్, మిగిలిన ప్రజాస్వామ్యాల మధ్య సారూప్యాన్ని, భేదాలను అధ్యయనం చేయాలి.

  రిఫరెన్స్: Comparative Government and politics, 8th edition, Rod Haque and Martin Harrop.

5.
పార్లమెంటు, రాష్ట్రాల శాసన వ్యవస్థలు:

  దీనికి సంబంధించి భారత పార్లమెంటు, కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ద్విసభా స్వభావాన్ని అధ్యయనం చేయాలి. దిగువ, ఎగువ సభల మధ్య వ్యత్యాసాలను తెలుసుకోవాలి. చట్ట సభల అధికారాలపై దృష్టిసారించాలి.

  రిఫరెన్స్: Our Parliament, National Book Trust.

6.
కార్యనిర్వాహక (executive), న్యాయ (judiciary) వ్యవస్థల నిర్మాణం, పనిచేసే విధానం..

  దేశంలో రాజకీయ కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగా రాష్ట్రపతి, ప్రధాని నేతృత్వంలోని మంత్రి మండలి, కేబినెట్, కేబినెట్ కమిటీలు, మంత్రుల సాధికార కమిటీల గురించి తెలుసుకోవాలి. రాజకీయ పార్టీలు, వాణిజ్య సంఘాలు, రైతు సంఘాలు తదితర నిర్బంధ సముదాయాలు రాజకీయ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవాలి.

  న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు, సబార్డినేట్ కోర్టుల నిర్మాణం, విధుల గురించి తెలుసుకోవాలి. న్యాయ సమీక్ష (judicial review), న్యాయ క్రియాశీలత (judicial activism) తదితరాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి.

  రిఫరెన్స్: Indian Administration, Fadia, and Fadia.

7.
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ముఖ్యాంశాలు..

  అభ్యర్థులు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను పరిశీలించడం ద్వారా దేశంలో ఎన్నికలకు సంబంధించిన అంశాలను అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉండాల్సిన అర్హతలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల అధికారాలు, అనర్హత తదితర విషయాలపై అవగాహన ఏర్పడుతుంది.

  రిఫరెన్స్: http://www.lawmin.nic.in/

8.
వివిధ రాజ్యాంగ పదవుల నియామకాలు, రాజ్యాంగ పదవులు, అధికారాలు, విధులు..

  గవర్నర్లు, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఎన్నికల కమిషన్ సభ్యులు, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంఘాలు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లు, యూపీఎస్సీ, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తదితరాల గురించి తెలుసుకోవాలి. నియామకాలు జరిగే విధానం, విధుల నిర్వహణ పరిస్థితులు, పదవుల నుంచి తొలగించే విధానం తదితరాల గురించి తెలుసుకోవాలి.

  రిఫరెన్స్: Indian Administration

9.
చట్టబద్ధ, నియంత్రిత, వివిధ పాక్షిక న్యాయ సంస్థలు..

  యూజీసీ వంటి చట్టబద్ధ సంస్థలకు, ప్రణాళికా సంఘం (Planning Commission) వంటి చట్టబద్ధత లేని సంస్థలకు మధ్య తేడాలను తెలుసుకోవాలి. ఉదారవాద విధానం అమలుతో మార్కెట్ వ్యవస్థ ప్రాధాన్యతను సంతరించుకోవటం తద్వారా సామా జిక న్యాయానికి ప్రమాదం సంభవిస్తుంది. నేప థ్యంలో రాజ్యం తరఫున మార్కెట్ను నియంత్రించడా నికి, సగటు పౌరుని ప్రయోజనాలను పరిరక్షించడానికి రెగ్యులేటరీ(నియంత్రిత) వ్యవస్థలు ఏర్పరచబడ్డాయి. ఇవి అర్థ, న్యాయ సంబంధ విధులను నిర్వర్తిస్తాయి.

  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), SEBI, IRDA, Bar Council of India, Medical cou-ncil of India, AICTE తదితర నియంత్రిత సంస్థ నిర్మాణం, కార్యకలాపాల గురించి తెలుసుకోవాలి.

  రిఫరెన్స్: దినపత్రికలు, మేగజీన్లు..

10.
ప్రభుత్వ విధానాలు (Government Policies), ప్రగతికి ప్రభుత్వం చూపే చొరవ..

  రాజ్యపు ఆశయాల అమలుకు ప్రభుత్వం విధానపర మైన నిర్ణయాలు గైకొంటుంది. ఉదాహరణకు పారిశ్రామిక విధానం; వ్యవసాయ విధానం; ఎగుమతులు, దిగుమతులు; బొగ్గు, స్పెక్ట్రం కేటాయింపులు; విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు). వీటి రూపకల్పన, అమలు, మూల్యాంకనం మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.

  రిఫరెన్స్: Public Policy: Formulation and Evaluation, R.K.Sapru.

11.
అభివృద్ధి ప్రవృత్తి, ప్రగతికి దోహదం చేసే పరిశ్రమలు..

  అభివృద్ధి ప్రక్రియలో జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల (NGOs) పాత్రను తెలుసుకోవాలి.

  పేదల సాధికారతలో స్వయం సహాయక సంఘాలు (SHGs) పోషిస్తున్న పాత్ర ఏమిటో తెలుసుకోవాలి.

  కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)తో పాటు అభివృద్ధి కార్యకలాపాల్లో వ్యక్తిగత దాతలు, దాతృత్వ సంస్థల భాగస్వామ్యం గురించి చదవాలి.

  రిఫరెన్స్: Development Administration, R.K.Sapru.

12.
బలహీన వర్గాలు-సంక్షేమ పథకాలు...

  పేదలు, మహిళలు, పిల్లలు, అనాదలు, రోగులు తదితరుల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి. పథకాలు అమలవుతున్న తీరు గురించి కూడా చదవాలి.

  గ్రామీణ గృహ పథకం; వృద్ధాప్య పింఛను పథకం; పేద విద్యార్థులకు ఫీజుల తిరిగి చెల్లింపు పథకం; దారిద్య్ర రేఖకు దిగువున (బీపీఎల్) ఉన్న వారికి ఆహార ధాన్యాల ఉచిత సరఫరా తదితరాలపై అభ్యర్థులు అధ్యయనం చేయాలి.

  రిఫరెన్స్: India Yearbook, 2013-chapter on Welfare programmes.

13.
సామాజిక రంగ సేవల (social sector services) అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన అంశాలు....

  వైద్యం; విద్య; రోడ్లు, రవాణా, గృహ నిర్మాణం, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పన గురించి తెలుసుకోవాలి.

  నిధుల లేమి, సేవలు అందించాల్సిన వారిలో ఆసక్తి కొరవడటం, ప్రజల్లో చైతన్యం లేకపోవడం, అవినీతి తదితర అంశాలను అధ్యయనం చేయాలి.

  నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం), సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్)లపై దృష్టిసారించాలి.

  రిఫరెన్స్: వార్తాపత్రికలు, మేగజీన్లు.. పేదరికం,

14.
ఆకలి సంబంధిత అంశాలు...

  ఉపాధి అవకాశాలు సరిగా లేకపోవడం, నైపుణ్యాల లేమి, నిరక్షరాస్యత, పోషకాహార లోపం తదితర అంశాల గురించి తెలుసుకోవాలి. పేదరిక నిర్మూలన, ప్రజలను ఆకలి నుంచి తప్పించడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడటంపైనా దృష్టిసారించాలి.

  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విజయాలు, వైఫల్యాలపై దృష్టి పెట్టాలి.

  రిఫరెన్స్: వార్తాపత్రికలు, టీవీ కార్యక్రమాలు

15.
పరిపాలనలో ముఖ్యాంశాలు: పారదర్శకత, జవాబుదారీతనం..

  సుపరిపాలనకు -గవర్నెన్స్ సమర్థవంతమైన వ్యవ స్థ. అయితే ప్రజల్లో అజ్ఞానం, నిరక్షరాస్యత, విద్యుత్, బ్రాడ్బ్యాండ్ సౌకర్యం తదితర మౌలిక వసతుల లేమి, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య సమన్వయం సరిగా లేకపోవడం మొదలైన సమస్యలకు ఆచరణాత్మకమైన పరిష్కార మార్గాలను అభ్యర్థులు సూచించగలగాలి. సిటిజన్ చార్టర్లు, సమాచార హక్కు మొదలైన అంశాలమీద సరిైయెున అవగాహన కలిగి ఉండాలి.

  రిఫరెన్స్: Public Administration, Avasthi & Maheswari.

16.
ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీస్ పాత్ర...

  ఆధునిక రాజ్యంలో సివిల్ సర్వీస్ ప్రాముఖ్యత ఏమి టో తెలుసుకోవాలి. సమాజంలో సుస్థిరతను పెంపొందించడంలో సివిల్ సర్వీస్ పాత్రను అర్థం చేసుకోవాలి. సమాజాన్ని సంఘటితపరచడంలో దాని కృషి, ప్రాథమిక సేవలను అందించడం, జాతి నిర్మాణ కార్యకలాపాలు చేపట్టడం తదితర అంశాలను తెలుసుకోవాలి. (పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్)

17.
భారత్, పొరుగు దేశాలతో సంబంధాలు..

  దక్షిణాసియా ప్రాంతంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రాంతంలోని మిగిలిన దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. ఇదే సమయంలో విస్తీర్ణం, జనాభాల పరంగా భారత్ పెద్దగా ఉండటంతో పొరుగుదేశాల్లో అసూయ కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు అంత బాగా లేవనే చెప్పొచ్చు.

  అభ్యర్థులు ప్రత్యేకంగా భారత్-చైనా; భారత్-పాకిస్థాన్ సంబంధాలతోపాటు భారత్ అనుసరిస్తున్న లుక్ ఈస్ట్ పాలసీ విధానంపై దృష్టిసారించాలి.

  రిఫరెన్స్: India's Foreign policy, Sumit Ganguly.

18.
ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్ గ్రూపులు- భారత్తో సంబంధమున్న ఒప్పందాలు..

  NAM, SAARC, BRICS, G20తదితరాలకు సంబంధించిన అంశాలను చదవాలి.

  రిఫరెన్స్: వార్తాపత్రికలు, మేగజీన్లు..

19.
భారత్పై అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల విధానాలు, రాజకీయాల ప్రభావం...

  భారత్పై ప్రపంచీకరణ ప్రభావంపై అధ్యయనం చేయాలి. దేశ విదేశాంగ విధానంలో ప్రవాస భారతీయుల ప్రభావమేంటో తెలుసుకోవాలి.

  రిఫరెన్స్: వార్తాపత్రికలు, మేగజీన్లు..

20.
ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు...

  ఐక్యరాజ్య సమితి (యూఎన్), దాని ప్రత్యేక సంస్థలైన UNDP, WHO, UNESCO తదితరాల గురించి తెలుసుకోవాలి.

  ప్రపంచ బ్యాంక్; ఐఎంఎఫ్, డబ్ల్యూటీవో తదితర సంస్థల గురించి చదవాలి.

  రిఫరెన్స్: International Organizations, Clive Archer.

సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ డాక్టర్ బి.జె.బి. కృపాదానం

 

 

పేపర్‌-4 (జనరల్స్టడీస్‌-3) 250 మార్కులు

సిలబస్‌:సాంకేతిక పరిజ్ఞానం(టెక్నాలజీ), ఆర్థికాభివృద్ధి, జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ), పర్యావరణం (ఎన్విరాన్మెంట్‌), భద్రత(సెక్యూరిటీ), విపత్తు నిర్వహణ (డిజాస్టర్మేనేజ్మెంట్‌).

ఎకానమీ-విశ్లేషణ

ఎకానమీ సిలబస్లో 10 చాప్టర్లను పేర్కొన్నారు. వీటికి సంబంధించి 125 మార్కుల వరకు ప్రశ్నలు వచ్చే అవకాశముంది. గత మెయిన్స్ ప్రశ్నపత్రాల్లో జనరల్స్టడీస్కు సంబంధించి సంక్షిప్త, దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇచ్చారు. ఈసారి సిలబస్మారిన నేపథ్యంలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే అవకాశముంది. తొలుత సిలబస్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి తర్వాత వర్తమాన పరిస్థితులకు అన్వయించి అధ్యయనం చేయాలి.

సిలబస్లో పేర్కొన్న అంశాలపై విశ్లేషణ..

1. ప్రణాళికలకు సంబంధించి ప్రణాళికా పెట్టుబడిలో భాగంగా ప్రభుత్వ రంగ వనరుల సమీకరణకు ఆధారాలు, వాటి ధోరణులు, వివిధ రంగాల మధ్య వనరుల పంపిణీ తదితర అంశాలను పరిశీలించాలి. ప్రణాళికలలో వృద్ధికి అనుపాతంగా ఉపాధి వృద్ధిని గమనించాలి. లోటు బడ్జెట్‌, విదేశీ సహాయం, నిరుద్యోగ భావనలు, 12 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి నోట్స్ రూపొందించుకోవాలి.

2.
సమ్మిళిత వృద్ధికి సంబంధించిన ముఖ్యాంశాలను అధ్యయనం చేసే క్రమంలో భారత్లో సాంఘిక వెనుకబాటుతునం నిర్మూలనలో సమ్మిళిత వృద్ధి పాత్ర, దాని సాధనకు వివిధ రంగాల్లో చేపట్టాల్సిన చర్యలను చదవాలి. ఆహారభద్రత, వ్యవసాయ బడ్జెట్‌, ఇండియా ఇన్క్లూజివ్ఫండ్తదితర అంశాలను అధ్యయనం చేయాలి. వీటి గురించి సంక్షిప్త నోట్స్ (short notes) రాసుకోవాలి.

3. బడ్జెటింగ్అనేది ముఖ్యమైన అంశం. దీన్నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా, ప్రభుత్వ రుణం, లోటు బడ్జెట్‌, కోశ విధానం, ఫెడరల్విత్తం వంటి అంశాలను పరిశీలించాలి.

4. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను పరిశీలించే క్రమంలో ఆర్థిక సంఘం పాత్ర, 13 ఆర్థిక సంఘం సిఫార్సులు, 14 ఆర్థిక సంఘం పైనా దృష్టి సారించాలి.

5. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, మూలధన రాబడి, మూలధన వ్యయం, ద్రవ్యలోటు, ప్రాథమిక లోటు, అంతర్గత రుణం, బహిర్గత రుణం తదితర అంశాలకు సంబంధించి సంక్షిప్త నోట్స్ రాసుకోవాలి.

6. వ్యవసాయ రంగానికి సంబంధించి స్వాతంత్య్రానంతరం పంటల తీరులో వచ్చిన మార్పులు, పంటల తీరును మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలు, వివిధ ఇరిగేషన్పద్ధతుల ధోరణులను అధ్యయనం చేయాలి. వ్యవసాయ మార్కెటింగ్లో ఎదురయ్యే సమస్యలను పరిశీలించాలి. క్రమబద్ధమైన మార్కెట్లు (రెగ్యులేటెడ్మార్కెట్లు), సహకార మార్కెటింగ్సొసైటీల పాత్రను పరిశీలించాలి.

7. వ్యవసాయ సమాచార విస్తరణలో మొబైల్టెక్నాలజీ, -టెక్నాలజీలో భాగంగా ఇన్పుట్మేనేజ్మెంట్‌, దిగుబడి అంచనా, వాటర్షెడ్మేనేజ్మెంట్ ప్రాధాన్యతను పరిశీలించాలి.

8. వ్యవసాయరంగానికి లభించే ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీ విధానం, కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రతకు సంబంధించి దీర్ఘ సమాధాన ప్రశ్నలను అధ్యయనం చేయాలి. లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ, పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థ, యూనివర్సల్పీడీఎస్‌, మద్దతు ధరలను నిర్ణయించడానికి అనుసరించే పద్ధతులు, వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్కు సంబంధించిన సంక్షిప్త నోట్స్ ను అధ్యయనం చేయాలి.

9. పారిశ్రామిక రంగంలో భాగంగా ఆహార ప్రాసెసింగ్పరిశ్రమల అభివృద్ధిని దశలవారీగా పరిశీలించాలి. సప్లయ్చైన్మేనేజ్మెంట్లో అంశాలు ఇమిడి ఉంటాయి. ఉత్పత్తిని మార్కెట్కు చేరవేయడం దగ్గర నుంచి వినియోగదారుని ప్రయోజనాల పరిరక్షణ వరకు ఉన్న అంశాలను సప్లయ్చైన్మేనేజ్మెంట్లో భాగంగా పరిశీలించాలి.

10. భూ సంస్కరణలలో భాగంగా మధ్యవర్తుల తొలగింపు, కౌలు విధానం, కమతాలపై గరిష్టపరిమితికి సంబంధించి తీసుకొచ్చిన శాసనాలు, వాటి అమల్లో ఎదురవుతున్న సమస్యలను పరిశీలించాలి. భారత సాంఘిక-ఆర్థికాభివృద్ధిపై భూ సంస్కరణల ప్రభావాన్ని పరిశీలించాలి. దీన్నుంచి 'జనరల్ప్రశ్నలు' వచ్చే అవకాశముంది.

11. 1991 తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలు.. భారత ఆర్థి వ్యవస్థ వృద్ధిపై మేరకు ప్రభావం చూపించాయో పరిశీలించాలి. పన్నులు, పారిశ్రామిక రంగం, మూలధన మార్కె ట్‌, బీమా రంగం, అంతర్జాతీయ వాణిజ్యంపై సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావాన్ని అధ్యయనం చేయాలి. 1948, తర్వాత రూపొందించిన పారిశ్రామిక తీర్మానాలలో మార్పుల నేపథ్యంలో పారిశ్రామికాభివృద్ధిని పరిశీలించాలి.

12.
ఇటీవల కాలంలో అవస్థాపనా రంగానికి ప్రాధాన్యం ఏర్పడిన దృష్ట్యా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాని (పీపీపీ)కి సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పీపీపీలో ప్రగతి, అవస్థాపనా ప్రాజెక్టుల నిర్మాణంలో పీపీపీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలి. శక్తి, రోడ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల అభివృద్ధిలో భాగంగా పీపీపీ ప్రగతిని పరిశీలించాలి.
13.
పెట్టుబడి నమూనాలలో భాగంగా వివిధ ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య నమూనాలను పరిశీలించాలి.
రిఫరెన్స్: Indian Economy: MISHRA & PURI, 30th edition.
Agriculture Economics: Sadhu & Singh.
Public finance: Musgrave & Musgrave.
India Infrastructure Report 2012
Industrial Economics: Cherunilam
Indian Economy: 22nd Edition, Uma Kapila & Raj Kapila.
Economics of Development and Planning: M.L.Jhingan.
ఎకానమీ: తమ్మా కోటిరెడ్డి

సైన్స్ అండ్టెక్నాలజీ, పర్యావరణం

1. సివిల్స్ మెయిన్స్ జీఎస్లో సైన్స్ అండ్టెక్నాలజీ సిలబస్ను ప్రత్యేకంగా పేర్కొన్నప్పటికీ గత మెయిన్స్ పరీక్షలలోని జీఎస్‌-2 పేపర్లో ఇదే సిలబస్నుంచి ప్రశ్నలు వచ్చాయి. అభ్యర్థులు విషయాన్ని గుర్తించి ప్రిపరేషన్కొనసాగించాలి.

2.
ఇంతవరకు యూపీఎస్సీ మోడల్పేపర్లను విడుదల చేయలేదు కాబట్టి ప్రశ్నల సరళి గత మెయిన్స్ జీఎస్పేపర్ల తరహాలో ఉండే అవకాశముంది. వివిధ స్థాయిల్లో పదాల పరిమితిని (20, 50, 150, 350 పదాలు) విధించి ప్రశ్నలు అడిగేందుకు అవకాశముంది. కాబట్టి సిలబస్లోని అంశాలపై పూర్తిస్థాయిలో ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. ఇందుకోసం అంశాలను బేసిక్స్ నుంచి చదవాలి. ప్రతి అంశం పరిధిని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఎక్కువ మంది అభ్యర్థులు విఫలమవుతున్నారు. ప్రశ్నల స్థాయిని అనుసరించి రైటింగ్ప్రాక్టీస్చేయాలి.

3.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ అండ్టెక్నాలజీ రంగంలో అభివృద్ధితో పాటు దైనందిన జీవితంలో దాని అనువర్తనాలు విధంగా ఉంటున్నాయన్న దానిపై అభ్యర్థులు దృష్టిసారించాలి. ఎలక్ట్రానిక్స్; ఆరోగ్య, వైద్య రంగం; రక్షణ, రోబోటిక్స్, కంప్యూటర్టెక్నాలజీలోని అభివృద్ధి అంశాలను చదవాలి. సరికొత్త కమ్యూనికేషన్పరికరాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి.

4.
దైనందిన జీవితంలో వాడే వాటర్ప్యూరిఫయర్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్, లైట్స్ , డయాగ్నస్టిక్కిట్స్ వంటి పరికరాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి.

5.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలకు సంబంధించి అభ్యర్థులు రక్షణ, అంతరిక్షం, ఐటీ, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో దేశం సాధించిన ప్రగతిపై దృష్టిసారించాలి.

6.
ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేస్తున్న కొత్త టెక్నాలజీపై అభ్యర్థులు దృష్టిపెట్టాలి. ఐటీ, అంతరిక్షం, కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీ అంశాలకు సంబంధించిన పరిధిని గుర్తించాలి. మధ్యకాలంలో రంగాల వారీగా సాధించిన ప్రగతిని అర్థం చేసుకోవాలి.

ఉదా: అంతరిక్ష రంగంలో ఇన్శాట్‌, ఐఆర్ఎస్వ్యవస్థ ఉపగ్రహాలు; వాటిని ప్రయోగించే పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ నౌకలు, చంద్రయాన్‌-1 తదితరాలను మాత్రమే కాకుండా ఇస్రో ప్రయోగించనున్న IRNSS, చంద్రయాన్‌-2, మార్స్ ఆర్బిటర్తదితరాలపై దృష్టిసారించాలి. అదే విధంగా అభివృద్ధి చెందుతున్న జీఎస్ఎల్వీ-మార్క్ 3, ఆస్ట్రోశాట్ గురించి చదవాలి. ఇటీవలి కాలంలో చేపట్టిన ప్రయోగాలు, వైఫల్యాల గురించి తెలుసుకోవాలి.

7. మేధో సంపత్తి హక్కులు, వాటి రకాలు, భారత్లో పరిస్థితులు, వివాదాలు, ఇటీవలి కాలంలో సాధించిన పేటెంట్లు తదితర అంశాలను అభ్యర్థులు అర్థం చేసుకోవాలి.

8. మానవ అభివృద్ధి కారణంగా పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడింది. మనిషి ఉనికి ప్రశ్నార్థకమైంది. నేపథ్యంలో పర్యావరణ కాలుష్యం (గాలి, నీరు, నేల, కాంతి) గురించి చదవాలి. శీతోష్ణస్థితిలో మార్పులకు కారణాలు-ప్రభావాలు, నష్టాలు, పరిష్కారాలు, అంతర్జాతీయ, జాతీయస్థాయి చర్యలపై దృష్టిసారించాలి.

9. జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదాలు, తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలను తెలుసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయస్థాయి చర్యలు, ఒప్పందాలు, పర్యవసానాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. భారత్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం పర్యావరణంపై విధంగా ఉంది? పర్యావరణ ప్రభావంపై అంచనాలో లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చదవాలి.

10. బేసిక్స్ ఫై పట్టు, సిలబస్లోని అంశాలపై విస్తృత పరిధిని తెలుసుకోవడం, రైటింగ్ప్రాక్టీస్తో మాత్రమే అధిక మార్కులు సాధించడానికి వీలవుతుంది.

రిఫరెన్స్: Science Reporter, Discovery, Hindu environmental survey, India year book.

సైన్స్ అండ్‌ టెక్నాలజీ: సి.హరికృష్ణ

 

భద్రత, విపత్తు నిర్వహణ విపత్తు, విపత్తు నిర్వహణ

1. విపత్తు అంటే ఏమిటి? అదెలా సంభవిస్తుంది? విపత్తులో రకాలు: సహజసిద్ధమైన, మానవ చర్యల వల్ల సంభవించే విపత్తులు. వీటిని ఎలా నివారించవచ్చు? నివారణ వీలుకానప్పుడు వాటి ప్రభావాన్ని ఏమేరకు తగ్గించవచ్చు? తదితర అంశాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి.

2.
సహజసిద్ధ విపత్తులలో ముఖ్యమైన సునామి, వరదలు, తుపానులు, భూకంపాలు, కరువు మొదలైనవి సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి.

3.
సీబీఎస్.. 9, 10, 11 తరగతుల్లో విపత్తు నిర్వహణను పాఠ్యాంశంగా చేర్చింది. అందువల్ల అభ్యర్థులు పుస్తకాలను చదవాలి.

4.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తుల నివారణకు, ఒకవేళ విపత్తులు సంభవిస్తే తగిన చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి (జాతీయ), ముఖ్యమంత్రి (రాష్ట్ర), కలెక్టర్‌ (జిల్లా) అధ్యక్షతన ఏర్పాటు చేసిన యంత్రాంగాలపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి.

రిఫరెన్స్: http://www.mha.gov.in/

అభివృద్ధికి, తీవ్రవాదానికి గల సంబంధం:

 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశాయి. దురదృష్టవశాత్తు వీటి ఫలాలు అర్హులైన వారికి అందలేదు. దళితులు, ఆదివాసులు, మహిళల జీవితం మరింత దుర్భరమైంది. నేపథ్యంలో నక్సలిజం ఆవిర్భవించింది. దీన్ని అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించే క్రమంలో బలహీనవర్గాలు సమిధలవుతున్నాయి. తీవ్రవాదం వ్యాప్తికి కారణమవుతున్న అంశాలు, దాని నివారణకు సంబంధించిన అంశాలను యూనిట్లో అధ్యయనం చేయాలి.

రిఫరెన్స్: Development Challenges in Extremist Affected Areas, Planning commission report.

దేశ ఆంతరంగిక భద్రతకు ఇతర రాజ్యాలు, రాజ్యాంగేతర శక్తులు విసురుతున్న సవాళ్లు:

ఒకవైపు చైనా, పాకిస్థాన్‌, కొంతమేరకు బంగ్లాదేశ్ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశ భద్రతకు విఘాతం కలిగిస్తుంటే, మరోవైపు మతఛాందసత్వం, తీవ్రవాదం (మావోయిజం), ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు వాదం దేశ ఆంతరంగిక భద్రతకు పెను సవాళ్లుగా మారాయి. భద్రతకు ముప్పు తెస్తున్న అవినీతి, కుల, మత, ప్రాంతీయ తత్వాలు, పేదరికం, బలహీనవర్గాల అణచివేత తదితరాలను కూడా అభ్యర్థులు విశ్లేషించాలి.

రిఫరెన్స్: India's Security challenges at home and abroad, C.Raja Mohan and Ajai Sahni 2012.

ఆంతరంగిక భద్రతకు సవాళ్లు:
1.
సమాచార వ్యవస్థలు, మీడియా పాత్ర, సామాజిక నెట్వర్క్స్- ఫేస్బుక్‌, ట్విట్టర్తదితరాలు. అంతర్జాలం (ఇంటర్నెట్‌) రెండంచుల కత్తి లాంటిది. ఇది ఒకవైపు తీవ్రవాద చర్యల్ని పసిగట్టడానికి, సుపరిపాలన అందించడానికి తోడ్పడుతుంటే మరోవైపు దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం శత్రుదేశాలకు, తీవ్రవాదులకు చేరే ప్రమాదముంది. రోజురోజుకూ సైబర్నేరాలు పెరిగిపోతున్నాయి. ఎలక్ట్రానిక్మీడియా ఆయా సంఘటనలను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ కొన్నిసార్లు భద్రతా దళాల నివారణ చర్యలకు విఘాతం కలిగిస్తున్నాయి. నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దేశ భద్రతకు విసురుతున్న సవాళ్లపై అభ్యర్థులు సరైన అవగాహన పెంపొందించుకోవాలి.

రిఫరెన్స్: Indian Administration, Fadia & Fadia. 2. India's internal security challenges, Ved Marwah.

2. అక్రమంగా డబ్బు తరలింపు నివారణ- ఇటీవల పార్లమెంటు అంతకుముందు అమల్లో ఉన్న చట్టాన్ని (2002) సవరిస్తూ విదేశాలలో అమలవుతున్న చట్టాలకు అనుబంధంగా మార్పులు తెచ్చింది. చట్టం.. అక్రమంగా తరలించిన డబ్బును ఉగ్రవాద చర్యలకు ఉపయోగించకుండా నివారించేందుకు ఉద్దేశించింది. అభ్యర్థులు నల్లధనం ఉగ్రవాదానికి ఎలా దోహదం చేస్తుంది? దాని నివారణ మార్గాలు ఏమిటి? తదితరాలపై దృష్టిసారించాలి.

రిఫరెన్స్: http://www.lawmin.gov.in/

సరిహద్దుల్లో ఉత్పన్నమయ్యే భద్రతా సవాళ్లు, వాటి నిర్వహణ; ఉగ్రవాదానికి వ్యవస్థీకృత నేరాలతో గల సంబంధం:

రోజూ వేలాది మంది పాకిస్థాన్నుంచి పంజాబ్‌, కాశ్మీర్భూభాగంలోకి; బంగ్లాదేశ్నుంచి పశ్చిమబెంగాల్‌, ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లోకి చొరబడుతున్నారు. అక్రమంగా ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నిషేధించిన వస్తువుల తరలింపు జరుగుతోంది. వనరులతో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు.

రిఫరెన్స్:Indian foreign policy and contemporary security challenges, Mukherjee and Malone.


వివిధ భద్రతా దళాలు, వాటి బాధ్యతలు:

1. సెంట్రల్రిజర్వ్ పోలీస్ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌), ఇండో-టిబెటన్బోర్డర్పోలీస్‌ (ఐటీబీపీ), బోర్డర్సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్ఎస్బీ), అస్సాం రైఫిల్స్ కాంబాట్బెటాలియన్ఫర్రిజల్యూట్యాక్షన్‌ (కోబ్రా), సెంట్రల్ఇండస్ట్రియల్సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌).

2. దళాలు విపత్తు నిర్వహణ, సరిహద్దుల గస్తీ, ఉగ్రవాద చర్యల నివారణ, రాజకీయ ప్రముఖులకు భద్రత, అవసరమైనప్పుడు శాంతిభద్రతల నిర్వహణ తదితర విధులు నిర్వర్తిస్తున్నాయి. వీటి వ్యవస్థీకరణ, పనితీరుపై అభ్యర్థులు సరైన అవగాహనను పెంపొందించుకోవాలి.

రిఫరెన్స్: http://www.mha.gov.in/

సెక్యూరిటీ, డిజాస్టర్మేనేజ్మెంట్‌: డా.బి.జె.బి. కృపాదానం

 

                              పేపర్-5 (జనరల్ స్టడీస్-4) మార్కులు-250
సిలబస్: నీతిశాస్త్రం (Ethics), నిజాయితీ (Integrity), అభిరుచి (Aptitude)
పేపర్లో 70 శాతం అంశాలు ప్రభుత్వ పాలనకు సంబంధించినవి. ప్రభుత్వ పాలనను (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) ఆప్షనల్గా తీసుకున్న వారికి జీఎస్-4 పేపర్ బోనస్ అని చెప్పొచ్చు. సిలబస్లో ఎనిమిది అంశాలను పేర్కొన్నారు. వీటిలో పాలన-నైతికతకు సంబంధించిన అంశాలపై విశ్లేషణ..

3.
అభిరుచి, సివిల్ సర్వీస్ ప్రాథమిక విలువలు (Aptitude and Foundational Values for Civil Service): కొందరు కొన్ని పనులు చేయడంలో సహజసిద్ధమైన సామర్థ్యం కలిగి ఉంటారు. దీన్ని అభిరుచిగా పేర్కొనవచ్చు. సివిల్ సర్వీస్పై అభిరుచి ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశిస్తే తమ వృత్తికి, సమాజానికి న్యాయం చేస్తారు. సివిల్ సర్వీస్ ఒక వృత్తి. దీనికి కొన్ని ప్రత్యేక విలువలున్నాయి. అవి: నిజాయితీ, నిష్పక్షపాతం, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం, ప్రజా సేవకు అంకితం కావడం, సమాజంలోని బలహీన వర్గాల పట్ల సహనం, కనికరం, దయాగుణం కలిగి ఉండటం. ఇవి చాలా వరకు ఉద్యోగి స్వామ్య లక్షణాలు. అభ్యర్థులు అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
రిఫరెన్స్: New Horizons Of Public Administration, Mohit Bhattacharya (Latest Edition).

4.
మానసికోద్వేగ మేధస్సు (Emotional intelligence) భావనలు-పాలనలో వీటి ఉపయోగం, అనువర్తన:
ఇటీవల కాలంలో మానసికోద్వేగ మేధస్సు (Emotional Intelligence) భావన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాకు చెందిన జాన్ మేయర్, పీటర్ శలోవీ అనే మనస్తత్వ శాస్త్రవేత్తలు భావనను ప్రాచుర్యంలోకి తెచ్చారు. రకమైన మేధస్సు కలిగిన వారు తమ మానసిక ఉద్వేగాలను అంచనా వేయగలగడం, అవసరాన్నిబట్టి వాటిని నియంత్రించడం-తద్వారా మానసిక, తెలివితేటల పెరుగుదలకు దోహదం చేస్తారు.

మానసికోద్వేగ మేధస్సు-ప్రత్యేక లక్షణాలు (Attributes):
1.
స్వయం స్పృహ (Self Awareness).

2. స్వయం నిర్వహణ(Self Management).

3. సామాజిక స్పృహ (Social Awareness).

4. సంబంధాలతో కూడిన నిర్వహణ (Relationship Management).

లక్షణాలు ఒక వ్యక్తి పనిని; మానసిక, శారీరక ఆరోగ్యాన్ని; తోటి వారితో గల సంబంధాలను ప్రభావితం చేస్తాయి. సమర్థవంతమైన పాలనకు మానసికోద్వేగ మేధస్సు ఎంతో అవసరం. ఇది కొంతవరకు సహజ సిద్ధంగా లభిస్తే మరికొంత శిక్షణ ద్వారా అభివృద్ధి చెందుతుంది. రకమైన మేధస్సు ద్వారా 1. ఒత్తిడి (stress)ని అధిగమించే సామర్థ్యం

2. ఉద్వేగాలను గుర్తించి, వాటిని నియంత్రించగల శక్తి కలిగి ఉండటం

3. సహచరులతో ప్రభావవంతంగా సంభాషించే(communicate) సామర్థ్యం

4. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలగడం

5. సమస్యలను ధైర్యంగా, సకారాత్మకంగా (positive) పరిష్కరించగలగడం వంటి నైపుణ్యాలను సాధించవచ్చు. అభ్యర్థులు అంశాలపై పట్టు సాధించాలి.
డానియల్ గోల్మన్ రచించిన Emotional Intelligence అనే గ్రంథం అత్యంత ప్రాచుర్యం పొందింది.
రిఫరెన్స్: Emotional Intelligence And The Construction And Regulation of Feelings, Mayer & Salovey, 1995)

6.
ప్రభుత్వ పౌరసేవల విలువలు, ప్రభుత్వ పాలనలో నైతికత (Public/Civil service values and Ethics in Public administration):
ప్రభుత్వ పాలనలో విలువలు, నైతికత స్థానం, సమస్యలు; ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవస్థల విలువలను, నైతికతను పాటించడంలో ఎదుర్కొంటున్న సందిగ్ధతలు; నైతికతకు దోహదం చేస్తున్న చట్టాలు, నిబంధనలు, మనస్సాక్షి (Conscience), జవాబుదారీతనం, నైతికబద్ధమైన పరిపాలన; పాలనలో నైతిక విలువలను పెంపొందించాల్సిన ఆవశ్యకత; అంతర్జాతీయ సంబంధాలలో నిక్షేపక నిధి విషయాలలో నైతికాంశాలు; కార్పొరేట్ పాలన.

ఇటీవల కాలంలో సామాజిక విలువలు క్షీణించడాన్ని గమనిస్తున్నాం. దీని ప్రభావం పరిపాలనపై కనిపిస్తోంది. అధికారంలో ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడటం, పక్షపాతంగా వ్యవహరించడం, అవినీతి కార్యకలాపాలకు పాల్పడటం వంటివి చోటుచేసుకుంటున్నాయి. జవాబుదారీతనం లోపిస్తోంది. నేపథ్యంలో విలువలకు, నైతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వంలో పనిచేసే వారికి ఉండాల్సిన కనీస విలువలు, నైతిక ఆవశ్యకత అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
అంతర్జాతీయ సంబంధాల్లో నైతికత మేరకు ఉందన్న దాన్ని అధ్యయనం చేయాలి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు వర్ధమాన దేశాలను దోచుకోవడం, స్వలాభం కోసం ఇతర దేశాల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం వంటివి అనైతిక చర్యలు. ఇటీవల కాలంలో సంభవించిన ఇరాక్ యుద్ధం, లిబియాలో విప్లవం, ప్రస్తుత సిరియా అంతర్యుద్ధం వంటివి పెట్టుబడిదారి దేశాల ప్రయోజనాల పరిరక్షణకు కొనసాగించినవే.
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి తదితర అంతర్జాతీయ సంస్థలు రుణాలిచ్చేటప్పుడు విధించే షరతులు చాలా వరకు అనైతికమైనవి. సంస్థలు పేద దేశాలను దోచుకోవడానికి తోడ్పడుతున్నాయన్న సందేహం వస్తుంది. అలాగే బహుళజాతి సంస్థలు లాభాపేక్షతో తృతీయ ప్రపంచ దేశాల వనరుల (బొగ్గు, ఇనుము, పెట్రోలియం..) ను దోచుకోవడం, బహుళజాతి కంపెనీలు నాసిరకం మందులను అమ్మడం, పేటెంట్ రక్షణ పేరుతో కాలం చెల్లిన మందులను స్వల్ప మార్పులతో అధిక ధరలకు అమ్ముతూ పేదలను పిప్పిచేయడం వంటి సంఘటనలు అనైతిక చర్యలకు ఉదాహరణలు. వీటికి సంబంధించిన సమకాలీన అంశాలపై అభ్యర్థులకు పట్టుండాలి.
రిఫరెన్స్: 1. New Horizons Of Public Admini-stration, Mohit Bhattacharya. 2. News Papers, Magazines.

7.
పరిపాలనలో నిజాయితీ/రుజువర్తన (Probity in Governance):
ప్రజాసేవ భావన; పాలన, రుజువర్తన తాత్విక మూలం; ప్రభుత్వంలో సమాచారాన్ని పంచుకోవడం, పారదర్శకత, సమాచార హక్కు, నైతిక నియమావళి, ప్రవర్తనా నియమావళి, పౌర హక్కులపత్రం (ఛార్టర్), పని సంస్కృతి, అందించే సేవల్లో నాణ్యత, ప్రభుత్వ నిధుల వినియోగం, అవినీతి సవాళ్లు.
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో సేవాభావం మేరకు ప్రస్ఫుటమవుతోంది? పాలనలో నీతి, నిజాయితీ లోపిస్తోందా? వంటి వాటిపై అభ్యర్థులు ఆలోచిం చగలగాలి. సమాచార మార్పిడి ద్వారా పారదర్శకంగా విధులను నిర్వర్తించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించవచ్చు. పాలనను సమాచార హక్కుఏ విధంగా మెరుగుపరుస్తుందో, అవినీతి నివారణకు ఎలా దోహదం చేస్తుందో అధ్యయనం చేయాలి.
అన్ని వృత్తుల మాదిరిగానే ప్రజాసేవ(పబ్లిక్ సర్వీస్) ఒక వృత్తి. వృత్తిలో ఉన్నవారు పాటించాల్సిన ప్రవర్తనా నియమావళి, ఉద్యోగుల్లో జవాబుదారీతనం అలవడేలా చేస్తుంది. పౌర హక్కుల పత్రం సగటు పౌరునికి సాధికారత కల్పిస్తూ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసేటట్లు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సోమరితనం, ఉదాసీనత వంటి అవలక్షణాలను తొలగించడం, వారిలో పని సంస్కృతిని పెంపొందించడం అవసరం.
మన దేశంలో ఏటా రూ.లక్షల కోట్లు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నప్పటికీ సగటు భారతీయుడి పరిస్థితి మెరుగుపడకపోవడానికి కారణం నిధుల దుర్వినియోగం. దీన్నెలా అరికట్టవచ్చన్న అంశంపై అభ్యర్థులు అధ్యయనం చేయాలి. ప్రతిరోజూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రోజురోజుకూ అవినీతి పెరిగిపోవడానికి కారణాలు, దాని మూలంగా నల్లధనం, ప్రభుత్వ విధానాలను మాఫియా ప్రభావితం చేయడం, రాజకీయ వ్యవస్థ నేరపూరితం కావడం తదితరాలపై అభ్యర్థులు అధ్యయనం చేయాలి. అవినీతిని నిర్మూలించడానికి తగిన పరిష్కార మార్గాల (లోకాయుక్త వంటి వ్యవస్థలు, స్వయంప్రతిపత్తి కలిగిన సీబీఐ వ్యవస్థ)ను అభ్యర్థులు సూచించగలగాలి.
రిఫరెన్స్: Public Administration, Avasthi & Maheswari

8.
పైన ప్రస్తావించిన అంశాలకు సంబంధించి వాస్తవ సంఘటనల అధ్యయనం (Case Studies):
A)
నైతికత, నిజాయితీ: (Ethics, Integrity) రవివర్మ నౌకాదళంలో ఉన్నతాధికారి. శ్రీకాంత్ రవివర్మతో కలిసి కొంతకాలం నౌకాదళంలో పనిచేసి తర్వాత రక్షణ శాఖకు ఆయుధాలు సరఫరా చేసే బహుళజాతి సంస్థలో మార్కెటింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఒకసారి నౌకాదళం ఏర్పాటు చేసిన సెమినార్లో ఇద్దరూ కలుసుకున్నారు. గత జ్ఙాపకాలను నెమరువేసుకున్నారు. అదే రోజు సాయంత్రం శ్రీకాంత్ ఆహ్వానం మేరకు రెస్టారెంట్లో ఇద్దరూ కలుసుకున్నారు. భోజన సమయంలో శ్రీకాంత్.. రవివర్మ శక్తిసామర్థ్యాలను మెచ్చుకుంటూ తమ సంస్థ సరఫరా చేసే ఆయుధాలు కొనుగోలు చేసేటట్లు నిర్ణయం తీసుకోవాలని, దీనికి తగిన పారితోషికం ఇస్తామని ఆశపెడతాడు. తమ సంస్థలో రెట్టింపు జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలుకుతాడు. విషయం బయటకు పొక్కకుండా చూస్తానని హామీ ఇస్తాడు.
సందర్భంలో నీవు రవివర్మ స్థానంలో ఉంటే ఎలా స్పందిస్తావు?
ఇది నీ నిజాయితీకి, నైతికతకు సంబంధించిన విషయం. నీ ముందు కింది ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

1.     ఊహించని పరిణామానికి నీవు నిత్తేజుడవవుతావు. లంచం ఇవ్వచూపిన కంపెనీ ఉద్యోగిపై నీకు కోపం వస్తుంది. ప్రవర్తనా నియమావళి ప్రకారం జరిగిన విషయాన్ని నౌకాదళంలోని నిఘా సంస్థకు తెలియజేస్తావు. కంపెనీ కాంట్రాక్టు రద్దు చేయాలని సిఫార్సు చేస్తావు.

2.     నిన్ను అకస్మాత్తుగా అదృష్టం వరించిందని ఉబ్బితబ్బిబ్బవుతావు. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న సమయంలో అవకాశం రావడం నీకు చాలా సంతోషాన్నిస్తుంది. శ్రీకాంత్తో ఒప్పందం చేసుకొని అతను పనిచేస్తున్న కంపెనీకి ఆయుధాల సరఫరా కాంట్రాక్టు ఇస్తావు.

3.     జరిగిన సంఘటనపై మరోసారి ఆలోచించి శ్రీకాంత్తో ఇకపై మాట్లాడకూడదని, జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పనవసరం లేదని భావిస్తావు. పాత సహచరుడుగా శ్రీకాంత్ ప్రతిపాదించిన విషయాన్ని తీవ్రంగా పరిగణించకుండా పై అధికారులకు తెలియజేయనవసరం లేదని నిర్ణయం తీసుకుంటావు.

B) గాజా (పాలస్తీనా)లో నివసించే పాలస్తీనా కాందీశీకుల కోసం ఐక్యరాజ్య సమతి ఉప అంగమైన UNRWA (United Nations Relief And Work Agency) ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలుకావడం లేదు. దీనికి కారణం: పర్యవేక్షకుల్లో సరైన నాయకత్వ లక్షణాలు లేకపోవడం, నాయకుల్లో మానసికోద్వేగ మేధస్సు లోపించడం. నాయకుల మేధస్సుపై వ్యవస్థ సమర్థత మేరకు ఆధారపడి ఉంటుందనే అంశంపై గాజాలో ఉన్న ఇస్లామిక్ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు విస్తృత పరిశోధన చేశారు. పర్యవేక్షకులను, సేవలు పొందే ప్రజలను ఇంటర్వ్యూ చేయగా, ప్రజాస్వామ్యబద్ధ నాయకత్వానికి, వ్యవస్థ సమర్థతకు దగ్గరి సంబంధముందని, నాయకుల మానసికోద్వేగ మేధస్సు అధీనుల(సబార్డినేట్స్)ను ప్రభావితం చేస్తుందని తేలింది. సామాజిక మేధస్సు (Social Intelligence).. వ్యవస్థలో సమర్థత పెంపునకు దోహదం చేస్తుందని పరిశోధనలో రుజువైంది.
నోట్: మిగిలిన అంశాలపై కేస్ స్టడీస్ అధ్యయనం కోసం పై నమూనా కేస్ స్టడీస్ ఉపయోగపడతాయి.
కెరటం నాకు ఆదర్శం.. ఉవ్వెత్తున లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు..
ఇది వ్యక్తి వైఖరి (Attitude)లోని దృఢత్వాన్ని సూచిస్తుంది. ఇలాంటి వైఖరులున్న అధికారులు సమర్థవంతమైన వారుగా గుర్తింపుపొందుతారు

సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ బి.జె.బి. కృపాదానం

--
Source : www.sakshi.com