Saturday, June 3, 2017

Inspirational journey of Civil Service toppers -2017

మిత్రులందరికీ శుభోదయం,

చాలా సంతోషం కలిగించిన వార్త.
తొలిసారిగా తెలుగు మాధ్యమం మొదటి ఐదు స్థానాల్లో చేరడం మనందరికీ గర్వకారణం. ఆ మొదటిస్థానం కూడా ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.
విజయాన్ని ఆహ్వానించి ఆస్వాదిద్దాం.
జై తెలుగు

ఏడీ సర్కారు బడి పనికిరాదన్నోడు..? ఏడీ తెలుగు మీడియం దండుగన్నోడు..?

ప్రతి సర్కారు బడిలో ఈయన కథను నోటీసు బోర్డులో అతికించాలి… ప్రతి పిల్లవాడికీ చెప్పి స్ఫూర్తిని నింపాలి… తెలుగు మీడియంలో చదివే ప్రతి విద్యార్థికీ ఈ కథ చెప్పి ఆత్మన్యూనతను తొలగించాలి… వారిలో పట్టుదలను, కసిని, జ్ఞానతృష్ణను పెంచాలి… ఎవరైతే సర్కారు బడిలో చదవడం దండుగ అంటాడో తనకు ఈ ఫోటో చూపించాలి… తెలుగు మీడియం పనికిరాదన్న ప్రతివాడినీ రోణంకి గోపాలకృష్ణ తెలుసా అనడగాలి… ఎందుకు..? ఎందుకు..? 'ముచ్చట' మనస్పూర్తిగా అభినందిస్తూ, ప్రశంసిస్తూ చెబుతున్న ఓ రియల్ సక్సెస్ స్టోరీ ఇది… కృత్రిమమైన విజయగాథలకు భిన్నంగా, చీత్కారాలు, ఎగతాళి వ్యాఖ్యల నడుమ సివిల్స్ థర్డ్ ర్యాంకును కొట్టేసిన ఈ సిక్కోలు మణిపూస కథ ఇది… ఎందుకంటే ఈ ర్యాంకు సాధన మనకు చాలా చాలా పాఠాలు చెబుతున్నది గనుక…!

ఈయన పేరు రోణంకి గోపాలకృష్ణ… తల్లీ తండ్రీ ఇద్దరూ వ్యవసాయ కూలీలు… నిరక్షరాస్యులు… ఊరు శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం, పారసంబ… వీథిబడిలోనే స్కూల్ చదువు… ఇంటర్ దాకా తెలుగు మీడియం… డిగ్రీ చేసింది ఆంధ్రా యూనివర్శిటీ దూరవిద్యలో… ప్రతిభకు కులం ఉండదు, పేదరికం ఉండదు, ప్రాంతం ఉండదు… మనిషిలో ఎదగాలనే కసి ఉండాలే గానీ ఏదీ అడ్డురాదు అని చెప్పేందుకు ఉదాహరణ తను… ఉపాధ్యాయ శిక్షణ పొందాక 2007లోనే టీచర్ అయ్యాడు… అదే మండలంలోని రేగులపాడులో సర్కారీ టీచర్… 2006 నుంచి సివిల్స్ కోసం పోరాటం… 2012లోనే గ్రూపు-1 ఇంటర్వ్యూల దాకా వెళ్లాడు… చివరకు గోల్ కొట్టాడు… అదీ జాతీయ స్థాయిలో థర్డ్ ర్యాంకు… అదీ అల్లాటప్పా కాదు… ఎలాగంటే..?

ఓ సాదాసీదా కూలీ కుటుంబం… కాసింత పొలం… చదివింది తెలుగు మీడియం, సర్కారు బడి… పైగా డిగ్రీయేమో దూరవిద్య… వెనుకబడిన జిల్లా… ఇప్పటికీ తన ఊరికి న్యూస్ పేపర్ రాదు… తను సర్కారు బడిలో చదివే రోజుల్లో ఆ ఊరికి అసలు కరెంటే లేదు… గుడ్డి దీపాలే… తన సివిల్స్ కోరిక విని అడ్మిషన్స్ ఇవ్వటానికే నిరాకరించాయి హైదరాబాద్‌లోని పలు కోచింగ్ సెంటర్లు… మొహం మీదే నవ్వి వెక్కిరించారు… వాటి నడుమ తనలో పట్టుదల మరింత పెరిగింది… ఏకంగా తెలుగులో మెయిన్స్, తెలుగు లిటరేచర్ ఆప్షనల్… తెలుగులో ఇంటర్వ్యూ… మొత్తం తెలుగే… చూడండి… ఎన్నిరకాల ప్రతికూలతలు, అయితేనేం… పదకొండేళ్ల ఆ పోరాటానికి చివరకు ఆ సివిల్స్ శిఖరం తనే వంగి సెల్యూట్ కొట్టింది…
ఆ కుటుంబం సామాజికంగానూ ఇక్కట్లు పడింది… అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం తండ్రి ఎవరో నిమ్నకులస్తుడి ఇంట్లో భోంచేసినందుకు చుట్టాలు, ఊరోళ్లు దాదాపు వెలివేశారు… ఎవరూ మాట్లాడరు… అదో శిక్ష… బాగా సాధనసంపత్తి ఉండి, విద్యావాతావరణంలోనే పెరిగి, అత్యుత్తమ కోచింగ్ తీసుకుని సివిల్స్ కొట్టినవాళ్లు, ర్యాంకులు పొందినవాళ్లకన్నా ఇలాంటి వ్యక్తులు సాధించిన ర్యాంకులకే విలువ ఎక్కువ… ఎందుకంటే, ఈ ర్యాంకుకు కన్నీటి రుచి ఉంది… మట్టి వాసన ఉంది… చీత్కారాల రంగు ఉంది… అన్నింటికీమించి తెలుగు మీడియాన్ని రద్దు చేస్తూ, సర్కారు బళ్లు మూసేస్తున్న ఇప్పటి దుస్థితిలో ప్రతి సర్కారు బడి విద్యార్థి, ప్రతి తెలుగు మీడియం విద్యార్థి తల ఎత్తుకుని చెప్పుకోగలిగేది ఈ కథ… అందుకే ఇదీ రియల్ సక్సెస్ స్టోరీ… కంగ్రాట్స్ గోపాలకృష్ణా…

https://youtu.be/8MRdzAS6Lec

https://youtu.be/FsMvgXfMNIE

https://youtu.be/iebqOOEsg9I

https://youtu.be/irxk3sRcEa8

https://youtu.be/oKSn1_6B5Dw

https://youtu.be/S_uY14YAEUQ

https://youtu.be/Mg39Vw_jFcw

https://youtu.be/FlLMsjmvusw

https://youtu.be/JpVYJBQExLI

Balalatha Mallavarapu trained a topper & Secured a Rank Herself in UPSC
www.thebetterindia.com/103238/balalatha-mallavarapu-upsc-rank-holder-mentor/ -via Flynx

http://m.hindustantimes.com/delhi-news/parents-disowned-disabled-girl-for-studying-after-class-8-she-cracked-civil-services-exam/story-vouuuC5Q7r3rzt1ItM4jLI.html

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే..
http://dhunt.in/2nnXl?s=a&ss=wsp

https://soundcloud.com/allindiaradionews/air-exclusive-interview-with-upsc-third-topper-gopalkrishna-ronanki


24 comments:

 1. This comment has been removed by the author.

  ReplyDelete
 2. Thanks for providing such nice information to us. It provides such amazing information on care/as well Health/. The post is really helpful and very much thanks to you. The information can be really helpful on health, care as well as on examhelp/ tips. The post is really helpful.
  NEET Cut off Marks 2017

  NEET Counselling 2017
  NEET Result 2017
  NEET Answer key 2017
  NEET Rank Predictor 2017

  ReplyDelete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
 4. Sir .
  I am also started preparation in Telugu
  Can u help me to get notes of gopala Krishna sir please please.🙏🙏🙏

  ReplyDelete
 5. I am a poor studentand belongs to the reserved category.But i aspire to become ias based on telugu optional .so please tell me good books for preparation both for optional and gs.sir please

  ReplyDelete
 6. congrats to ronanki gopalakrishna sir.. Thanks for providing such nice information to us.thank u so much sir again heartly congratulations to Ronanki gopalakrishna and all our telugu vijethalu..

  ReplyDelete
 7. Thanks for sharing such a wonderful post. Who ever looking for the best coaching for IAS/PCS in Lucknow, then join Prayatna IAS. It is one of the Best IAS coaching in Lucknow.

  ReplyDelete
 8. Congratulations gopalakrishna sir I am preparing by IAS please some information and tips send him my Gmail I'd knswamy22@gmail.com

  ReplyDelete
 9. Dear All,

  Pls attend the seminar on 24-6-2017 at AV college, Hyderabad for more information

  ReplyDelete
 10. Good morning sir
  I m unable to attend the seminar due to office .letme know your mail id for further contact as I have some doubts to be clarified sir

  ReplyDelete
 11. Good morning sir
  I m unable to attend the seminar due to office .letme know your mail id for further contact as I have some doubts to be clarified sir

  ReplyDelete
 12. Good morning sir
  I m unable to attend the seminar due to office .letme know your mail id for further contact as I have some doubts to be clarified sir

  ReplyDelete
 13. Good morning sir
  I m unable to attend the seminar due to office .letme know your mail id for further contact as I have some doubts to be clarified sir

  ReplyDelete
 14. Sir I want Telugu medium mains materials plz tell the information where I get those materials

  ReplyDelete
 15. Thank you sir, if you possible please provide all subject's reference books in telugu medium.i am confused for Which book is better to preparation. Thank you.

  ReplyDelete
  Replies
  1. Ne phone number cheppu bhayya antey nenu kuda telugulo prepare avudamankuntunna plzz

   Delete
 16. Thank you sir, if you possible please provide all subject's reference books in telugu medium.i am confused for Which book is better to preparation. Thank you.

  ReplyDelete
 17. Thanks for sharing this info, now you can also check your Recuritment 2018 by following below given links....

  west bengal police constable recuritment 2018

  corporation bank po recuritment 2018

  ReplyDelete
 18. నమస్కారం సార్‌.
  నాపేరు నాగేశ్వర నాయక్‌, ఉపాద్యాయుడు, నంద్యాల.
  నేను UPSC కి పూర్తిగా తెలుగు మాద్యమంలో సిధ్దమవుతున్నాను. హైదరాబాదు అశోక్‌నగర్‌కు వెళ్ళి విచారించి దొరికిన కొన్ని పుస్తకాలు తీసుకున్నాను. గత 4 నెలలుగా అనేక మాద్యమాలద్వారా సరైన పుస్తకాలకోసం అన్వేషిస్తూనే ఉన్నాను. అయినా సరైన మెటీరియల్స్‌ పొందలేకపోతున్నాను అనే అసంతృప్తి ఉంది. అదృష్టవశాత్తు కొన్ని యూట్యూబ్‌ వీడియోల ద్వారా ITCSA బ్లాగ్‌నిచూసి చాలా సంతోషిస్తున్నాను.

  సార్‌, దయచేసి
  UPSC కి సరైన తెలుగు పుస్తకాలు ఏవి?
  అవి ఎక్కడ లభిస్తన్నాయి?
  తెలియజేయగలరని ఆశిస్తున్నాను.

  ధన్యవాదాలతో
  నాగేశ్వర నాయక్‌
  9492182468.

  ReplyDelete
 19. నమస్కారం సార్‌.
  నాపేరు నాగేశ్వర నాయక్‌, ఉపాద్యాయుడు, నంద్యాల.
  నేను UPSC కి పూర్తిగా తెలుగు మాద్యమంలో సిధ్దమవుతున్నాను. హైదరాబాదు అశోక్‌నగర్‌కు వెళ్ళి విచారించి దొరికిన కొన్ని పుస్తకాలు తీసుకున్నాను. గత 4 నెలలుగా అనేక మాద్యమాలద్వారా సరైన పుస్తకాలకోసం అన్వేషిస్తూనే ఉన్నాను. అయినా సరైన మెటీరియల్స్‌ పొందలేకపోతున్నాను అనే అసంతృప్తి ఉంది. అదృష్టవశాత్తు కొన్ని యూట్యూబ్‌ వీడియోల ద్వారా ITCSA బ్లాగ్‌నిచూసి చాలా సంతోషిస్తున్నాను.

  సార్‌, దయచేసి
  UPSC కి సరైన తెలుగు పుస్తకాలు ఏవి?
  అవి ఎక్కడ లభిస్తన్నాయి?
  తెలియజేయగలరని ఆశిస్తున్నాను.

  ధన్యవాదాలతో
  నాగేశ్వర నాయక్‌
  9492182468.

  ReplyDelete