Thursday, May 21, 2015

సివిల్స్ నోటిఫికేషన్ వాయిదా


సివిల్స్ నోటిఫికేషన్ వాయిదా


సివిల్ సర్వీసెస్ పరీక్ష- 2015 నోటిఫికేషన్ వాయిదా పడింది.
Education Newsశనివారం (మే 16) నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా... ఎలాంటి కారణం చెప్పకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నోటిఫికేషన్‌ను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. నోటిఫికేషన్ ఎప్పు డు వెలువడేది తర్వాత తెలియజేస్తామంది. 2011లో సివిల్స్ రాసిన వారికి ఈ ఏడాది అదనంగా ఒక అవకాశాన్ని ఇవ్వాలని, అలాగే సీశాట్(అప్టిట్యూడ్ టె స్ట్)ను ర్యాంకుకు పరిగణనలోకి తీసుకోకుండా క్వాలిఫైయింగ్(33% మార్కు లు) పరీక్షగా కొనసాగించాలని కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పువల్లే సివిల్స్ నోటిఫికేషన్ వాయిదా పడి ఉండొచ్చని సమాచారం.

2 comments: