కృషి ఉంటే - అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టం కాదంటున్నారు 2018 సివిల్స్ విజేతలు. 2018 సివిల్ సర్వీసెస్ పరీక్షలలో తెలుగు పతాకాన్ని దేశంలో రెప రెప లాడించిన 2018 సివిల్ సర్వీసెస్ విజేతల కు ముందుగా అభినందనలు.
2018 సివిల్స్ విజేతల నేపధ్యం వారి మనోభావాలు, ఎంచుకున్న పాఠ్యాంశాలలోని మెళకువలను 2019 సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం అవుతున్న తెలుగు అభ్యర్ధులలో స్ఫూర్తిని రగిలించడానికి - విజేతల మాటలలోనే తెలియచెప్పేందుకు రేడియో అల 90.8 ఎఫ్.ఎం సహకారంతో ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ (ఐ.టి.సి.ఎస్.ఎ) చిరు ప్రయత్నం చేస్తుంది.
ఆగస్టు 10వ తేదీ రాత్రి 9 గంటలకు రేడియో అల 90.8 ఎఫ్.ఎం లేదా ప్రపంచంలో ఎక్కడనుండైనా వినడానికి www.radioala.in కు లాగిన్ అయ్యి సివిల్ సర్వీసెస్ విజేతల విజయ గాథలను విని, ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకుంటారని ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ (ఐ.టి.సి.ఎస్.ఎ) ఆకాంక్షిస్తుంది.