Monday, April 30, 2018

Civil Service Exam(CSE-2017) toppers from Telugu states -2018

 సివిల్‌ సర్వీసుల పరీక్షల్లో తెలంగాణ కుర్రాడు దురిశెట్టి అనుదీప్‌ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాడు. గతంలో ఇదే పరీక్షల్లో సాధారణ ర్యాంకుతో రెవెన్యూ సర్వీసుల్లో సహాయ కమిషనర్‌గా చేరిన ఇతను పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ గట్టిగా ప్రయత్నించి దేశవ్యాప్తంగా అందరికంటే ముందు నిలిచాడు. తెలంగాణకే చెందిన కోయ శ్రీహర్ష సైతం ఆరోర్యాంకు సాధించాడు. మొత్తం 990 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేసినట్లు బుధవారం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(యూపీఎస్సీ) విడుదల చేసిన ఫలితాల్లో పేర్కొంది. అనుకుమారి, సచిన్‌ గుప్తా వరుసగా రెండు, మూడో ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మహిళల్లో అగ్రగామిగా నిలిచిన కుమారి దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో బీఎస్సీ(ఆనర్స్‌) పూర్తి చేశారు. నాగ్‌పుర్‌లోని ఐఎంటీ నుంచి ఎంబీయే(ఫైనాన్స్‌, మార్కెటింగ్‌) అభ్యసించారు. దివ్యాంగురాలైన సౌమ్యశర్మ తొమ్మిదో ర్యాంకు సాధించారు. తొలి 25 ర్యాంకుల్లో 8 మంది యువతులు, 17 మంది పురుషులు ఉన్నారు. పరీక్ష ఫలితాలను యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌ ‌www.upsc.gov.in లో చూడవచ్చు.  మొత్తం 9.50 లక్షల మంది ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేయగా 13,000 మంది మెయిన్స్‌ పరీక్షలు రాశారు. ఇందులో మంచి మార్కులు సాధించిన 2475 మందిని మౌఖిక పరీక్షలకు పిలిచారు. మొత్తం 990 మందిలో 476 మంది జనరల్‌ కేటగిరీలో ఎంపికయ్యారు. మొత్తం 180 మందిని ఐఏఎస్‌కు ఎంపిక చేయగా వీరిలో జనరల్‌ కేటగిరీలో 93 మంది, ఓబీసీలో 46, ఎస్సీలు 28, ఎస్టీలు 13 మంది ఉన్నారు. ఐపీఎస్‌కు 150 మంది ఎంపికవ్వగా జనరల్‌ కేటగిరీలో 77 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కోయ శ్రీహర్షకు 6, శీలం సాయితేజకు 43వ ర్యాంకు వచ్చాయి. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్‌కు 196వ ర్యాంకు వచ్చింది.

6 comments:

  1. Congratulations for one and all. You will see my picture like this very soon with your cooperation.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Is there anybody Telugu medium rankers ?

    ReplyDelete
  4. Sir iam from rajahmundry.i want to prepare civils in Telugu medium.please reffer Telugu medium books and u will guide to me

    ReplyDelete
  5. Useful information. Thanks a lot. if you are stuck with pocket money woes?. Don't worry StuCred is providing loan to college students.
    Please follow our StuCred Website.

    ReplyDelete